ETV Bharat / state

Medaram hundi income: మేడారం జాతర మొత్తం ఆదాయం ఎంతంటే? - మేడారం జాతర మొత్తం ఆదాయం ఎంతంటే?

Medaram hundi income: మేడారం జాతర హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల... లెక్కింపు పూర్తి అయ్యింది. హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. మేడారం జాతర మొత్తం ఆదాయం ఎంతంటే?

Medaram hundi income
మేడారం జాతర మొత్తం ఆదాయం ఎంతంటే?
author img

By

Published : Mar 8, 2022, 10:26 AM IST

Medaram hundi income: సమ్మక్క-సారలమ్మ జాతరలో మొత్తం రూ.11,45,34,526 ఆదాయం వచ్చినట్లు మేడారం దేవాలయ కార్యనిర్వాహణ అధికారి రాజేంద్రం తెలిపారు. జాతరలో ఏర్పాటు చేసిన హుండీ, తిరుగువారంలో వచ్చిన 517 హుండీలను హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో లెక్కించారు.

10 రోజుల పాటు సాగిన ఈ లెక్కింపు ప్రక్రియ సోమవారంతో ముగిసింది. 631 గ్రాముల బంగారం, 48.350 కిలోల వెండి ఆభరణాలు వచ్చాయని ఈవో తెలిపారు. ఈ-హుండీ ద్వారా రూ.3 లక్షలతో పాటు విదేశీ కరెన్సీ నోట్లను భక్తులు కానుకలుగా సమర్పించారని పేర్కొన్నారు. 2020-జాతరలో రూ.11.64 కోట్ల ఆదాయం వచ్చింది.

పటిష్ఠ భద్రత నడుమ లెక్కింపు..

సీసీ కెమెరాల పటిష్ఠ భద్రతల మధ్య మేడారం హుండీ లెక్కింపు జరిగింది. లెక్కించిన నగదును దేవాదాయ శాఖ అధికారులు బ్యాంకు అధికారులకు అప్పగించి బ్యాంకులో జమ చేశారు. దేవస్ధానం సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, సేవా బృందాల సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. లెక్కింపు జరిగే మండపం పరిసరాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు పది రోజుల పాటు లెక్కింపు జరిగింది. ఏ రోజుకారోజు వచ్చిన ఆదాయాన్ని అధికారులు బ్యాంకుల్లో జమచేశారు.

ఈసారి పెరిగిన భక్తుల సంఖ్య

2020లో మేడారం జాతర సందర్భంగా రూ.15 కోట్ల 54 లక్షల 71 వేల రూపాయల ఆదాయం వచ్చింది. వాటిలో నగదు రూపేణా రూ.11 కోట్ల 65 లక్షలు.. వాటితో పాటు కిలో 63 గ్రాముల బంగారం, 53 కిలోల వెండి సమకూరింది. గతంలో 502 హుండీలను ఏర్పాటు చేశారు. మేడారం మహా జాతరలో ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై.. తల్లులను దర్శించుకున్నారు. నెల ముందు నుంచి... జాతర వరకూ కోటి ముప్పై లక్షలకుపైగా భక్తులు దర్శించుకున్నారని అంచనా వేశారు.

జాతర ముగిసిన తర్వాత ఆదివారం కూడా దాదాపు పదిలక్షలపైగా భక్తులు వచ్చి గద్దెల చెంత పూజలు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి జాతరకు నెల రోజుల ముందు నుంచే.. మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. 50 లక్షల మందికిపైగా భక్తులు.. జాతరకు ముందే దర్శనాలు చేసుకున్నారు. వేడుక జరిగిన నాలుగు రోజుల్లోనూ రద్దీ కొనసాగింది. పోలీసులు పటిష్ట చర్యలు తీసుకోవడంతో ఎక్కడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తలేదు. తాగునీటి విషయంలో.. జనం కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.