ములుగు జిల్లాలోని రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బొగ్గుల వాగు ఉప్పొంగి ప్రవహించడం వల్ల లక్నవరంలోకి భారీగా నీరు చేరుకుంది. సరస్సుకు 29 అడుగుల నీటిమట్టం చేరుకుంది. మరింతే వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 35 అడుగుల చేరుతుందని అధికారుల అంచనా.
ఇదీ చూడండి :కాళేశ్వరం ప్రాజెక్టులో మరో అద్భుతానికి శ్రీకారం..!