ETV Bharat / state

భక్త సంద్రమైన మేడారం.. వనదేవతలను దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు

Devotees at Sammakka Saralamma Temple: సెలవు రోజు కావడంతో వన దేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు మేడారం వచ్చారు. తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. గద్దెల చుట్టూ ఉన్న అడవిలో చెట్ల కింద భక్తులు భోజనాలు వండుకొని అక్కడే విడిది చేసి పిల్లపాపలతో సంతోషంగా గడుపుతున్నారు.

Devotees at Sammakka Saralamma Temple
Devotees at Sammakka Saralamma Temple
author img

By

Published : Jan 29, 2023, 5:25 PM IST

భక్త సంద్రమైన మేడారం.. వనదేవతలను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో వస్తోన్న భక్తులు

Devotees at Sammakka Saralamma Temple: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆదివారం కావడంతో రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. సొంత వాహనాలు, ఆర్టీసీ బస్సుల్లో తరలి వచ్చిన భక్తులు మొదటగా జంపన్న భాగంలో పుణ్యస్నానాలు ఆచరించి అనంతరం వనదేవతలను దర్శించుకుంటున్నారు.

వేలాదిగా తరలివచ్చిన భక్తులతో సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దల వద్ద భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. సమ్మక్క సారలమ్మ వనదేవతలతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులకు కొబ్బరికాయలు కొట్టి పసుపు, కుంకుమ చల్లి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. గద్దెల చుట్టూ ఉన్న అడవిలో చెట్ల కింద భోజనాలు వండుకొని అక్కడే విడిది చేసి పిల్లపాపలతో సంతోషంగా గడిపి తిరుగు ప్రయాణం చేస్తున్నారు.

భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయ నిర్వహకులు తగు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు శనివారం ములుగు జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గౌస్​ ఆలం, ఏటూరు నాగారం ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సిరిశెట్టి సంకీర్త్​ మరికొందరు అధికారులు ఆలయానికి వచ్చి సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్నారు.

Devotees Crowd at Yadadri: సెలవురోజు కావడంతో రాష్ట్రంలో మరో పుణ్యక్షేత్రమైన యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. దూర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఆలయానికి భక్తులు విచ్చేశారు. దీంతో ఉచిత దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట సమయం పడుతోంది. రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

లడ్డూ ప్రసాదం కౌంటర్లు, నిత్య కల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది. లక్ష్మీ నరసింహ నామస్మరణతో యాదగిరి గుట్ట ప్రతిధ్వనిస్తోంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. పార్కింగ్ స్థలంలో రద్ధీ దృష్ట్యా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.