ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన కాకతీయ కట్టడం రామప్ప ఆలయాన్ని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy visits Ramappa temple) సందర్శించారు. ములుగులో ప్రపంచ వారసత్వ శిలాఫలకాన్ని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో అనేక కట్టడాలు ఉన్నప్పటికీ గుర్తింపు పొందలేకపోయాయని తెలిపారు. తాను కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రామప్పపై దృష్టిపెట్టానని చెప్పారు. రామప్పకు వచ్చే ప్రపంచ పర్యాటకుల కోసం వరంగల్‌లో విమానాశ్రయం ఉండాలన్న కిషన్‌రెడ్డి .. రాష్ట్ర ప్రభుత్వం స్థలం, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఉడాన్ పథకం కింద విమానాశ్రయానికి రాయితీ ఇస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు.
![Kishan Reddy visits Ramappa temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13415062_1045_13415062_1634800516167.png)
వసతి సౌకర్యం కల్పించాలి: సీతక్క
రామప్పలో ఆర్కిటెక్చర్ కళాశాల ఏర్పాటు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క సూచించారు. మేడారం వచ్చే భక్తులకు వసతి సౌకర్యం కల్పించాలన్న ఆమె.. అన్ని ప్రాంతాల నుంచి ములుగుకు బస్ సౌకర్యం కల్పించాలని కోరారు. మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
![Kishan Reddy visits Ramappa temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13415062_klsghf.jpg)
కాకతీయ సర్య్కూట్ ద్వారా పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చేయాలి
తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ప్రాచీన కట్టడాలు అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (minister srinivas goud) అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఎప్పుడూ ప్రాచీన కట్టడాలకు గుర్తింపు రాలేదని, రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా రావడంతో సీఎం కేసీఆర్ కల నెరవేరిందని, రాష్ట్రంలో ఇంకా అద్భుత కట్టడాలకు గుర్తింపు రావాల్సి ఉందన్నారు. పర్యాటకానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ఇందుకు కేంద్రం కూడా సహకరించి నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు. యాదాద్రీశ్వరుడిని దర్శించుకొని, అక్కడి నుంచి రామప్ప ఇతర ప్రాచీన కట్టడాలను దర్శించుకొనేలా కాకతీయ సర్క్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: Union Minister Kishan Reddy : నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పర్యటన