ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో 117 మందికి కోటి 17లక్షల రూపాయల కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్వర్ల చేతుల మీదుగా అందించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.
ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని.. అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ అధికారులు, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఇంట్లో విద్యుదాఘాతం... మంటల్లో సామగ్రి దగ్ధం