ETV Bharat / state

పండ్ల చెట్ల నరికివేతతో వానరాల అగచాట్లు.. ఆహారం కోసం తిప్పలు! - ములుగు జిల్లాలో వానరాల కష్టాలు

దైవస్వరూపంగా పూజించే వానరాలు వాహనాల బారినపడి విగతజీవులవుతున్నాయి. అడవులపై ఆధారపడిన మూగజీవులకు మానవులు చేస్తున్న అకృత్యాలతో అగచాట్లు తప్పడంలేదు. అడవులలోని పచ్చని చెట్లను, తీయని ఫలాలను అందించే వృక్షాలను విచక్షణారహితంగా నరికివేస్తున్న నరుల అక్రమాలు వానరాలకు శాపంగా మారాయి. అందమైన ప్రకృతి ఒడిలో చెంగుచెంగున ఎగురుతూ చెట్ల కొమ్మలపై నుంచి దూకుతూ ఇష్టమైన పండ్లను తింటూ ఆనందంగా గడిపే అమాయక వానరాలు.. బుద్ధిజీవులు పడవేసే ఆహారంకోసం రహదారులపై ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది.

monkies, mankey food courts, mulugu
వానరాలు, ములుగు జిల్లా, మంకీ ఫుడ్‌ కోర్టులు
author img

By

Published : Jan 21, 2021, 1:44 PM IST

ములుగు జిల్లాలో 2,93,915 హెక్టార్ల విస్తీర్ణంలో దట్టమైన అడవులున్నా, ఆకాశాన్ని అంటుతున్న వృక్షాలు కనిపిస్తున్నా కోతులు, పక్షులు తినేందుకు పండ్లను అందించే చెట్లు కరవయ్యాయి. కోతుల పండ్ల వనాలు కాగితాలకే పరిమితమయ్యాయి. పండ్ల వనాల ఏర్పాటు చేపట్టాలంటూ ప్రభుత్వం ఆదేశించినా అధికారుల్లో చలనం లేకపోయింది. హరితహారం పేరుతో లెక్కలకోసం మొక్కలు నాటుతున్న పాలకులు, అధికారులు మూగజీవాల క్షుద్బాధను తీర్చేందుకు చేస్తున్న పనుల్లో చిత్తశుద్ధి కనిపించడంలేదు. ములుగు మండలం జాకారం, తాడ్వాయి మండలంలో మాత్రమే పండ్ల వనాలు ఏర్పాటు చేశారు. జాకారంలో సుమారు ఎకరం విస్తీర్ణంలో 800, తాడ్వాయిలో 100 పండ్ల మొక్కలను నాటారు. కోతుల పండ్లవనాలను(మంకీ ఫుడ్‌ కోర్టు) అడవులకు దగ్గరగా ఏర్పాటు చేస్తే మేలు.

అడవిలో పండ్ల మొక్కలేవీ..?

అడవిలో అధికంగా కనిపించే నేరేడు, ఉసిరి, వెలగ, జీడిమామిడి, తునికి, మొర్రి, పరికి, పాల పండ్ల చెట్లు ప్రస్తుతం మచ్చుకైనా కనిపించని దుస్థితి ఏర్పడింది. వానరాలు, పక్షులు అడవిలో పరుగులు పెట్టాల్సిన మూగజీవులు.. రహదారుల వెంట వాహనాలను చూసి వాటి వెనుక పరిగెత్తాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడింది. పండ్ల మొక్కలను అక్రమార్కులు నరికివేయడం, అడవుల పెంపకంలో జంతువులకు ఆహారాన్ని అందించే ఫలాల మొక్కలను ప్రభుత్వం, అటవీశాఖ పెంచకపోవడమే. వ్యాపార దృక్పథం జామాయిల్‌ (యూకలిప్టస్‌), వెదురు, టేకు మొక్కలను పెంచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు కానీ అడవుల అందాలకు ఆయువుపట్టైన పక్షులకు, జంతువులకు అవసరమైన పండ్ల మొక్కలు పెంచేందుకు శ్రద్ధ వహించడం లేదు. జిల్లాలోని ఏటూరునాగారం, పస్రా అభయారణ్యాల్లో కేవలం 22 హెక్టార్లలో అటవీశాఖ 8,800 పండ్ల మొక్కలను నాటింది. ఏటూరునాగారంలో 17 హెక్టార్లలో 6,800, పస్రాలో 5 హెక్టార్ల విస్తీర్ణంలో 2 వేల పండ్ల మొక్కలను అధికారులు నాటారు.

ప్రయాణికులు వేస్తేనే కడుపు నిండేది..

రహదారుల వెంట ప్రయాణికులు పడవేస్తున్న పండ్లు, టమాటాలు, ఫలహారాలతో కడుపు నింపుకుంటున్న మూగజీవుల బాధను పట్టించుకున్న నాథులే కరవయ్యారు. వానరాల దుస్థితిపై చలించిన కొందరు జంతు ప్రేమికులు ప్రత్యేకంగా తమ వెంట తెచ్చిన టమాటాలను ఆహారంగా వేస్తున్నారు. మంగపేట నుంచి వరంగల్‌ రహదారిలో వేలాది వానరాలు రహదారిపై ప్రయాణికులు పడవేసే ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయి. బొగత జలపాతంలో సందర్శకులు, లక్ష్మీనరసింహస్వామి కోవెలకు వస్తున్న భక్తులు అందించే తినుబండారాల కోసం సంచరిస్తున్న వానరాలు ఆశగా ఎదురుచూడడం మూగజీవుల దయనీయ దుస్థితికి తార్కాణం.

monkies, mankey food courts, mulugu
రోడ్డు పైకి వచ్చి ప్రయాణికులు అందించిన టమాటాలు తింటున్న కోతులు

వాహనాలతో బతుకు పోరాటం
రహదారులపై వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలతో వానరాలు బతుకు పోరాటం చేస్తున్నాయి. ప్రయాణికులు పడవేసే పండ్ల కోసం రహదారికి ఇరువైపులా పరుగెత్తి ప్రాణాలు కోల్పోతున్నాయి. కోతులకు పండ్లను అందించాలనే ఆసక్తి, ఆత్రుతలో ప్రయాణికులు విసురుతున్న పండ్లు రహదారిపై పడడంతో వాటికోసం పరుగెత్తి ప్రాణాలు కోల్పోతున్నాయి.

కొత్తవి ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం
- పారిజాతం, డీఆర్డీవో, ములుగు
ప్రస్తుతం ములుగు, తాడ్వాయి మండలాల్లో మంకీ ఫుడ్‌ కోర్టులను ఏర్పాటు చేశాం. మరికొన్ని ప్రాంతాల్లో ఈ ఏడాది ఏర్పాటు చేస్తాం. కోతులు, పక్షుల కోసం ఆహారం అందించడానికి కృషి చేస్తాం.

ఇదీ చదవండి: 'ఆర్థిక లావాదేవీల ద్వారా నంబర్లు తీసుకుంటారు... స్వాప్​ చేసేస్తారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.