ములుగు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం గంటపాటు జోరుగా కురిసింది. వెంకటాపూర్, గోవిందరావుపేట మండలాల్లో తెల్లవారుజాము నుంచే పడిన వానకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నీళ్లు ఇళ్లల్లోకి వస్తాయేమో అని ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షం వల్ల ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందిపడ్డారు.
ఇదీ చదవండిః రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 18 మందికి గాయాలు