ములుగు జిల్లాలో వాజేడు మండలంలోని చీపురుపల్లి సమీపంలోని బొగత జలపాతం గత కొద్ది రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా మరింత అందాన్ని సంతరించుకుంది. కరోనా కారణంగా ఆరు నెలలుగా బోసిపోయిన జలపాతం వద్దకు గురువారం పర్యాటకులు రావడం వల్ల సందడిగా మారింది. మరో నయగారాగా పిలువబడే ఈ బొగత అందాలను చూసి పర్యాటకులు కేరింతలు కొడుతున్నారు. వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి వచ్చిన అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.
ఇదీ చూడండి: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతోన్న వరద.. 16 గేట్లు ఎత్తివేత