ETV Bharat / state

సంవత్సరం సంపాదనంతా... ఈ నాలుగురోజుల్లోనే!! - మేడారం జాతర 2020

మేడారం సమ్మక్క, సారాలమ్మలు... భక్తులకు చల్లని దీవెనలతో పాటు చిరు వ్యాపారులకు సైతం ఉపాధిని కల్పిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు కావాల్సిన వస్తువులను అమ్ముకుంటూ... సంవత్సరం మొత్తం కలిగే ఆదాయాన్ని ఈ నాలుగు రోజుల్లో సంపాదిస్తారు. జాతరలో ఉపాధి పొందుతున్న చిరు వ్యాపారులపై ఈటీవీ భారత్​ కథనం.

heavy business in medaram
సంవత్సరం సంపాదనంతా... ఈ నాలుగురోజుల్లోనే!!
author img

By

Published : Feb 9, 2020, 6:04 AM IST

సంవత్సరం సంపాదనంతా... ఈ నాలుగురోజుల్లోనే!!

మేడారం జాతర లక్షలాది మందిని అక్కున చేర్చుకొంది. సకల సౌకర్యాలతో మహానగరిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తజనులకు... కావాల్సిన వస్తువులను అందించారు చిరువ్యాపారులు.

పిన్నీసు నుంచి... మొదలు

రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చారు. దీనితో మేడారంలో పెద్ద మార్కెట్​ ఆవిష్కృతమవుతోంది. పిన్నీసు నుంచి మొదలుకొని మహిళలకు కావాల్సిన అలంకరణ వస్తువులు, పిల్లలు ఆడుకునే వస్తువులు, ప్రయాణాలకు వినియోగించే సూట్​ కేసులు వంటి అనేక రకాల వస్తువులు అమ్ముతూ... వేలాది మంది ఉపాధి పొందారు.

తల్లుల దయతో వ్యాపారం

మేడారం జాతర రాక కోసం లక్షలాది భక్తులతో పాటు చిరు వ్యాపారులు కూడా ఎదురు చూస్తారు. పిల్లలతో సహా వచ్చి వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు. తల్లుల చల్లని దయతో తమ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క నాలుగు రోజుల్లోనే సంపాదన

మారుమూల కుగ్రామమైన మేడారం జాతర వచ్చిందంటే... ఎటుచూసినా కనిపించే దుకాణాలతో సందడిగా కనిపిస్తుంది. తాము సంవత్సరమంతా కష్టపడితే వచ్చే సంపాదనంతా... ఈ నాలుగు రోజుల జాతర సమయంలోనే సంపాదిస్తామని సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి:కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద ఐదుగురు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.