ETV Bharat / state

ఆ లక్ష్యంతోనే హాత్​ సే హాత్​ జోడో అభియాన్.. మేడారం నుంచే ప్రారంభం - revanth reddy on hath se hath jodo abhiyan

రాహుల్ సందేశాన్ని ఇంటింటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా రాష్ట్రంలో హాత్​ సే హాత్​ జోడో అభియాన్​ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు కాంగ్రెస్​ నేతలు పేర్కొన్నారు. రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ యాత్ర కొనసాగుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఈ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

ఆ లక్ష్యంతోనే హాత్​ సే హాత్​ జోడో అభియాన్

author img

By

Published : Feb 4, 2023, 7:58 PM IST

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాలను హాత్ సే హాత్ జోడో కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తామని కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్​రావు ఠాక్రే వెల్లడించారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం జరుగుతున్నట్లు చెప్పారు. రాహుల్ సందేశాన్ని ఇంటింటికీ తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు ఆయన వివరించారు. మాణిక్​రావు ఠాక్రే, రేవంత్ రెడ్డిల అధ్యక్షతన గాంధీభవన్​లో జరిగిన ముఖ్య నేతల సమావేశంలో హాత్ సే హాత్ జోడో యాత్ర ప్రధాన అజెండాగా చర్చించారు.

ఈ సందర్భంగా ఈ నెల 6న మొదలయ్యే జోడో యాత్రలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి నాయకుడు పాల్గొంటారని మాణిక్​రావు పేర్కొన్నారు. ఉత్తమ్, భట్టి, మధుయాష్కీ ఇతర ముఖ్య నేతలు వివిధ ప్రాంతాల్లో ఈ యాత్రను ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో అభియాన్​ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

''రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో హాత్ సే హాత్ జోడో అభియాన్ కార్యక్రమం చేపడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను హాత్ సే హాత్ జోడో ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తాం. రాహుల్ సందేశాన్ని ఇంటింటికీ తీసుకెళ్లడమే లక్ష్యం. రెండు నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో కొనసాగుతుంది.''-మాణిక్​రావు ఠాక్రే, కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ

గవర్నర్ పచ్చి అబద్ధాలతో అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ను పొగిడారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తున్న ఈ తరుణంలో ఆ ఇద్దరు నాటకాలకు తెర తీశారని.. అందుకు రాజ్​భవన్​ను వేదికగా వాడుకున్నారని విమర్శించారు. ఇప్పటివరకు అనేక విషయాల్లో కేసీఆర్ పనితీరును ప్రశ్నించిన గవర్నర్.. ఇప్పుడు స్వరం మార్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్​ను గవర్నర్ కాపాడే ప్రయత్నం చేశారన్నారు. అన్ని విషయాల్లో వైఫల్యం చెందిన కేసీఆర్ అబద్ధాలను గవర్నర్ కప్పిబుచ్చే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ విధానాలు అన్నీ ఒక్కటేనని.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని తాము ముందు నుంచీ చెబుతూనే ఉన్నామని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్​కు లేదని.. కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్​ ఆరోపించారు. కేసీఆర్​కు ప్రజలు, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదన్న ఆయన.. వారికి ఇవే చివరి ఎన్నికలన్నారు. ఫిబ్రవరి 6న ములుగు జిల్లా మేడారం సమ్మక్క-సారలమ్మ నుంచి హాత్ సే హాత్ జోడో అభియాన్ ప్రారంభించనున్నట్లు చెప్పారు. మండల పార్టీ కమిటీలు రద్దయినట్లు గతంలో ప్రకటించామని, ఇప్పుడు అవే కమిటీల నేతృత్వంలో జోడో యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి.. కొత్త కమిటీలు వేసే వరకు ఇవే పని చేస్తాయని స్పష్టం చేశారు.

''మేడారం నుంచి హాత్ సే హాత్ జోడో అభియాన్ ప్రారంభం అవుతుంది. కాంగ్రెస్‌పై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకే ఈ యాత్ర. బీజేపీ, బీఆర్​ఎస్​ విధానాలన్నీ ఒక్కటే. ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తుంటే ఇద్దరూ కలిసి డ్రామాకు తెరలేపారు. గవర్నర్ పచ్చి అబద్ధాలతో కేసీఆర్‌ను అసెంబ్లీలో పొగిడారు. కేసీఆర్‌కు ప్రజలు, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం లేదు.'' - రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఆ లక్ష్యంతోనే హాత్​ సే హాత్​ జోడో అభియాన్

ఇవీ చూడండి..

రేవంత్ పాదయాత్ర.. నేతలంతా ఐక్యంగా పాల్గొనాలన్న మాణిక్​ రావు ఠాక్రే

సమస్యలు వదిలేయండి.. సామరస్యంగా సాగండి.. ఠాక్రే పిలుపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.