ETV Bharat / state

ట్రైనీ ఐఏఎస్​లకు మేడారం జాతర నిర్వహణ బాధ‌్యతలు - ట్రైనీ ఐఏఎస్​లకు మేడారం జాతర నిర్వహణ బాధ‌్యతలు

మేడారం జాతర నిర్వహణ బాధ‌్యతలు శిక్షణ ఐఏఎస్‌లకు ప్రభుత్వం అప్పగించింది. 2018 బ్యాచ్‌కు చెందిన 8 మంది ఐఏఎస్‌లను డిప్యుటేషన్‌పై నియమించింది. ఈ నెల పదో తేదీ వరకు బాధ్యతల్లో ఉండనున్నారు.

medaram jathara
medaram jathara
author img

By

Published : Feb 4, 2020, 9:07 PM IST

మేడారం జాతరకు శిక్షణ ఐఏఎస్​ల సేవలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోనుంది. 2018 బ్యాచ్​కు చెందిన ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం వివిధ జిల్లాల్లో అసిస్టెంట్ కలెక్టర్లుగా శిక్షణలో ఉన్నారు. సమ్మక్క - సారలమ్మ జాతరలో వారి సేవలను వినియోగించుకునేందుకు వీలుగా డిప్యుటేషన్​పై నియమించింది.

అభిలాష అభినవ్, ఆదర్శ్ సురభి, అనుదీప్ దురిశెట్టి, హేమంత్ సహదేవ్ రావ్, కోయ శ్రీహర్ష, కుమార్ దీపక్, తేజస్ పవార్, సత్యప్రసాద్ మేడారంలో డిప్యుటేషన్​పై విధులు నిర్వర్తించనున్నారు. ఈ నెల పదో తేదీ వరకు శిక్షణ ఐఏఎస్​లు బాధ్యతల్లో ఉండనున్నారు.

ఇదీ చూడండి: మేడారం ఎఫెక్ట్: ములుగుకు నలభైరోజుల్లో నాలుగో 'సారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.