వచ్చే మేడారం జాతర నాటికి మంత్రి కేటీఆర్... ముఖ్యమంత్రి హోదాలో వేడుకలకు రావాలని వనదేవతలకు మొక్కినట్లు మాజీ స్పీకర్ మధుసూదనాచారి కుమారుడు ప్రశాంత్ తెలిపారు. మధుసూదనాచారి అనుయాయులతో అమ్మవార్లను దర్శించుకున్నారు.
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే వచ్చే జాతరలో నిలువెత్తు బంగారం సమర్పించుకుంటామని మొక్కుకున్నట్లు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని వేడుకున్నామన్నారు.
కేసీఆఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలందరికీ చేరుకుని సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని కోరుకున్నామని ప్రశాంత్ తెలిపారు.
ఇవీ చూడండి:వనమంతా జనమయ్యేది రేపట్నుంచే..