ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ గెలుపు కోసం తెరాస పార్టీ ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్కు అతి సన్నిహితుడైన కుసుమ జగదీష్ గెలవడానికి పార్టీ ముఖ్య నేతలు ప్రచారం చేస్తున్నారు. మండలంలో 9 ఎంపీటీసీ స్థానాల గెలుపే ధ్యేయంగా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: 'చట్టసభల్లో ప్రజాగొంతుక ప్రతిధ్వనించాలి'