ETV Bharat / state

'ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి' - మహిళా, శిశు సంక్షేమంపై అధికారులతో సమావేశం

గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేకశ్రద్ధ చూపాలని నేషనల్​ కమిషన్ ఆఫ్​ ప్రొటెక్షన్ ఛైల్డ్​ రైట్స్ డాక్టర్​ ఆర్.జి ఆనంద్​ సూచించారు. ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్​ ఆడిటోరియంలో వైద్య, ఐసీడీఎస్​ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

doctor anand  conducted meeting district officers on women and child welfare
'ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి'
author img

By

Published : Dec 17, 2020, 8:39 PM IST

ములుగు జిల్లా వెంకటాపూర్​ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నేషనల్​ కమిషన్ ఆఫ్​ ప్రొటెక్షన్ ఛైల్డ్​ రైట్స్ డాక్టర్​ ఆర్.జి. ఆనంద్​ పరిశీలించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని ఆయన సూచించారు. ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించాలని.. వారికి సకాలంలో సేవలందించాలన్నారు. అనంతరం 1098 ఛైల్డ్​ లైన్​ కార్యాలయాన్ని పరిశీలించి.. పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టరేట్​లోని ఆడిటోరియంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి మండలానికి ఒక బృందాన్ని నియమించి.. ప్రతివారం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని జిల్లా పాలనాధికారి క్రిష్ణ ఆదిత్య తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో 0 నుంచి 18 ఏళ్ల వరకు పిల్లల డేటాబేస్​ రూపొందిస్తున్నామని అదనపు కలెక్టర్ ఆదర్శ్​ సురభి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి ప్రేమలత, గ్రామీణాభివృద్ధి అధికారి పారిజాతం, సీడబ్లూసీ ఛైర్మన్ పరశురాములు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:చక్రం తిప్పుతానని చెప్పి.. బొంగరం కూడా తిప్పలేదు: లక్ష్మణ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.