ETV Bharat / state

మావోయిస్టులు బెదిరించి వసూళ్లు చేస్తున్నారు: డీజీపీ - Manuguru Latest News

రాష్ట్రంలో మావోయిస్టుల అలజడితో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో విలాస జీవితం గడుపుతూ.. గిరిజనులను విప్లవ ఉద్యమం వైపు ఆకర్షిస్తున్నారన్నారు. పలు జిల్లాల్లోని అడవుల్లో మావోలు సంచరిస్తున్నారన్న సమాచారంతో డీజీపీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ప్రజలను మావోలు భయపెడుతున్నారు: డీజీపీ మహేందర్‌ రెడ్డి

author img

By

Published : Jul 18, 2020, 3:26 PM IST

Updated : Jul 18, 2020, 5:59 PM IST

రాష్ట్రంలో మావోల అలజడితో నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఈ క్రమంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నెల 12న ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణీ అడవుల్లో పలువురు మావోయిస్టు సభ్యులు తప్పించుకుపోయారు. మళ్లీ 15న తొక్కిగూడెంలో జరిగిన ఎదురుకాల్పుల్లోనూ మావోలు తప్పించుకున్నారు.

డైరీలో కీలక అంశాలు..

మావోయిస్టులు బెదిరించి వసూళ్లు చేస్తున్నారు: డీజీపీ

ఎదురుకాల్పుల సమయంలో దొరికిన డైరీలో కీలక అంశాలు తెలిసినట్లు సమాచారం. ఫలితంగా అప్రమత్తమైన పోలీసులు.. ఐదారు వందల మందితో తిర్యాణి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కీలక నేత మైలారపు అడెల్లు సహా మరో ఏడుగురు నక్సల్స్ అడవుల్లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

'ఇంటిలిజెన్స్ విభాగం అప్రమత్తంగా ఉండాలి'

కుమురం భీం జిల్లాలో పరిస్థితిని డీజీపీ స్వయంగా సమీక్షించారు. ఇంటలిజెన్స్‌ విభాగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మావోయిస్టులు లొంగిపోతే చట్టప్రకారం సహకరిస్తామని కుమురం భీం జిల్లా ఎస్పీ విష్ణు వారియర్‌ పేర్కొన్నారు.

అడవుల జల్లెడ..

ఆసిఫాబాద్‌ ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోలు భూపాలపల్లి, ములుగు జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉండటం వల్ల కూంబింగ్‌ బృందాలు అడవులను జల్లెడ పడుతున్నాయి. నాటు పడవలతో గోదావరి దాటే ప్రయత్నం చేస్తారనే అనుమానంతో రేవుల వద్ద కదలికలపై దృష్టి సారించారు. డ్రోన్ కెమెరాలు, GPS సాంకేతికతను వినియోగిస్తూ అడవులను జల్లెడ పడుతున్నారు.

ఆసిఫాబాద్ అనంతరం ములుగు..

ఆసిఫాబాద్‌ పర్యటన అనంతరం డీజీపీ ములుగులో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రజలను మావోయిస్టులు భయపెడుతున్నారని డీజీపీ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన మావోయిస్టులను మళ్లీ రాకుండా చూడాలని మహేందర్‌ రెడ్డి పోలీసులకు దిశానిర్దేశం చేశారు. హరిభూషణ్, దామోదర్, ఆజాద్ ఛత్తీస్‌గఢ్‌లోనే ఉన్నారని వివరించారు. గుత్తేదారులు, రాజకీయ నేతలు, వైద్యులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారని ఆయన వివరించారు.

విస్త్రృత తనిఖీలు..

ఆసిఫాబాద్ నుంచి హెలికాఫ్టర్​లో ములుగు జిల్లా వెంకటాపురానికి చేరుకున్న డీజీపీకి జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ వెంకటాపురం ఠాణాను సందర్శించారు. హెలీప్యాడ్ ను, పోలీస్ స్టేషన్​ను డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృత తనిఖీలు చేశారు. గ్రేహౌండ్స్ అదనపు డీజీ కె. శ్రీనివాసరెడ్డి, ఐజీలు నాగిరెడ్డి, నవీన్ చంద్, ప్రభాకర రావు సహా తదితర ఉన్నతాధికారులు డీజీపీ వెంట ఉన్నారు.

ములుగు తర్వాత మణుగూరు..

ములుగు పర్యటన అనంతరం కొత్తగూడెం జిల్లా మణుగూరుకు డీజీపీ పయనమవుతారు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మావోయిస్టులకు సహకరించవద్దని మహేందర్‌ రెడ్డి కోరారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు అగ్రనేతలు విలాస జీవితం గడుపుతూ... గిరిజనులను మాత్రం విప్లవ ఉద్యమం వైపు మళ్లిస్తున్నారని డీజీపీ పేర్కొన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఏజెన్సీవాసులు భయాందోళన చెందుతున్నారు.

ఇవీ చూడండి : తిర్యాని అడవుల్లో ముగిసిన డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన

Last Updated : Jul 18, 2020, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.