Medaram Jatara Rush: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం భక్తులతో కళకళలాడుతోంది. ఆదివారం సెలవు దినం కావడం వల్ల రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, చత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. వనదేవతలను దర్శించుకునేందుకు ముందుగానే భక్తులు తరలివస్తున్నారు.
జంపన్న వాగు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి... ముడుపులు కట్టి తలనీలాలు సమర్పించుకున్నారు. వనదేవతల సన్నిధికి చేరుకుని పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. ఉదయం నుంచి భక్తుల రాక మొదలైంది. ఇప్పటి వరకు లక్షకు పైగానే భక్తులు సమ్మక్క - సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. ఇంకా భక్తులు వనదేవతల దర్శనం కోసం తరలివస్తున్నారు.
ఆర్టీసీ బస్సులు...
వచ్చే ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరిగే మేడారం మహాజాతర కోసం తెలంగాణ ఆర్టీసీ 3845 బస్సులు నడిపేందుకు నిర్ణయించింది. సుమారు 21 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో 2020లోనూ దాదాపు ఇదే సంఖ్యలో ఆర్టీసీ సర్వీసులు నడిపింది. భక్తులు భారీగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి రానున్న నేపథ్యంలో ఒక్క వరంగల్ ఆర్టీసీ రీజియన్ నుంచే 2,250 బస్సులను నడిపేందుకు ఆమోదం లభించింది. ఈసారీ హైదరాబాద్ నుంచి ఏసీ బస్సులు నడవనున్నాయి. జాతర సమయంలో బస్సులను నిలిపేందుకు ఆర్టీసీ 50 ఎకరాల్లో భారీ బస్టాండును నిర్మిస్తోంది.
ఇవీ చూడండి: