ములుగు జిల్లాలో ప్రఖ్యాత శిల్పాలు కొలువు తీరిన పర్యాటక కేంద్రం రామప్ప ఆలయానికి వెళ్లాలంటే భక్తులు, సందర్శకులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి నెల రోజుల క్రితం చెరువు మత్తడి ప్రవాహంలో కొట్టుకుపోయింది.
అయితే.. ఆ మార్గంలో మిషన్ భగీరథ పైపులు ధ్వంసం కాగా.. అధికారులు ఇటీవలే కొత్త పైప్‌లైన్ వేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆలయం చేరుకోవడానికి ఆ పైప్‌లైనే ఆధారంగా మారింది. ప్రమాదమని తెలిసినా ఒకరిని చూసి మరొకరు పైప్‌లైన్‌పై నడుస్తూ రామప్ప రామలింగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తున్నారు.
ఇదీ చదవండిః 6న అపెక్స్ కౌన్సిల్ సమావేశం.. జల వివాదాలపై చర్చ