ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం జాతరలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనం కోసం తరలివస్తున్నారు.
జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కళ్యాణ కట్టలో తలనీలాలు సమర్పించుకుంటున్నారు. కుటుంబ సమేతంగా నిలువెత్తు బంగారం (బెల్లం), కొబ్బరి కాయలు, పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, చీరెలతో మొక్కులు తీర్చుకుంటున్నారు.
పగిడిద్దరాజు, గోవిందరాజులకు పూలమాల వేసి, కొబ్బరి కాయలు కొట్టి అమ్మవార్ల ఆశీర్వాదం పొందుతున్నారు. మొక్కులు తీర్చిన వనదేవతలకు గొర్రెలు, మేకలు, కోళ్లు బలిస్తున్నారు.
తిరుగు ప్రయాణంలో మేడారం, తాడ్వాయి, పడిగాపురం, నార్లపూర్, వెంగళాపురం అడవుల్లో చెట్ల కింద విందు ఏర్పాటు చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపి సొంతగూటికి వెళ్తున్నారు.
ఇదీ చూడండి: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి