ETV Bharat / state

దేవాదుల ప్రాజెక్టుకు మరో రూ.4వేల కోట్లు కావాలి..!

author img

By

Published : Mar 10, 2021, 6:57 AM IST

2004 ఆరంభంలో చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు జులై నాటికి గానీ, ఈ ఏడాది ఆఖరుకు పూర్తి చేయాలనేది రాష్ట్ర సర్కార్ లక్ష్యం. తాజా అంచనాల ప్రకారం అన్ని పనులు పూర్తి చేయడానికి మరో రూ.నాలుగు వేల కోట్లు అవసరమయ్యే అవకాశం ఉండటం వల్ల దేవాదుల ప్రాజెక్టు పనులు ఈ ఏడాదిలో పూర్తయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.

devadula-lift-irrigation-scheme-needs-funds-to-complete-its-works
దేవాదుల ప్రాజెక్టుకు మరో రూ.4వేల కోట్లు

దేవాదుల ఎత్తిపోతల.. 2004 ఆరంభంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జులై నాటికి గానీ, లేనిపక్షంలో ఈ ఏడాది ఆఖరుకు పనులు పూర్తి చేయాలనేది రాష్ట్ర సర్కారు లక్ష్యం. దేశంలో సాగునీటి ప్రాజెక్టుల్లో ఎక్కువ పొడవైన సొరంగ మార్గం పని దాదాపు పూర్తి కావొచ్చినా, ఎత్తిపోతలకు అనుబంధంగా ఉన్న పనులు, డిస్ట్రిబ్యూటరీల పనులు ఇంకా మిగిలే ఉన్నాయి. తాజా అంచనాల ప్రకారం అన్ని పనులు పూర్తి చేయడానికి మరో రూ.నాలుగు వేల కోట్లు అవసరమయ్యే అవకాశం ఉంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొంటే దేవాదుల ఎత్తిపోతల నిర్మాణం ఈ ఏడాదిలో పూర్తయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. దేవాదుల ఎత్తిపోతల పథకానిది రెండు దశబ్దాల నిర్మాణ చరిత్ర. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరు నాగారం మండలం గంగారం గ్రామం వద్ద నుంచి 38.5 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసి 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు సరఫరా చేసేందుకు 2004లో ఈ ప్రాజెక్టును చేపట్టారు. మూడుదశల్లో మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించి గుత్తేదారులతో ఒప్పందాలు చేసుకొన్నారు. దశాబ్దం క్రితమే పూర్తి కావలసిన ఈ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతుండగా నిర్మాణ వ్యయం మాత్రం గణనీయంగా పెరిగింది.

దేశంలోనే ఇది భారీ సొరంగం

దేశంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో ఇంత పొడవైన భారీ సొరంగం ఇప్పటివరకు లేదని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాలువలో 43.5 కి.మీ సొరంగమార్గం తవ్వుతుండగా, దేవాదుల మూడవ దశలో ఒకే సొరంగమార్గం 49.6 కి.మీ. ఇది దాదాపు పూర్తి కావొచ్చింది. ధర్మసాగర్‌ నుంచి ఆర్‌.ఎస్‌.ఘనపూర్‌ వరకు నీటిని మళ్లించే పనిలో ఎనిమిది కిలోమీటర్ల సొరంగ మార్గం పూర్తి కావాల్సి ఉంది. ఈ పనులతోపాటు ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే పనులను పూర్తి చేయాల్సి ఉంది. దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.

మిగిలిన సొరంగం పనులు

పూర్తికాని డిస్ట్రిబ్యూటరీలు

మొదటి, రెండోదశ కింద ప్రధాన పనులు పూర్తయినప్పటికీ డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాకపోవడంతో ఆయకట్టుకు నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. మొదటి దశ పని పూర్తయిందని 2008లో సోనియాగాంధీతో ప్రారంభోత్సవం చేయించారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే డిస్ట్రిబ్యూటరీ పనులు సాగుతూనే ఉన్నాయి.

5.18 టీఎంసీల నీటిని 170 రోజుల్లో ఎత్తిపోసి 1.22 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించేందుకు 2004 జనవరిలో మొదటి లిప్టు పనికి ఒప్పందం జరిగింది. జలయజ్ఞంలో దీంతోపాటు ఇతర పనులు కూడా చేపట్టారు. 2008లో లిఫ్టు పని, పైపులైన్‌ నిర్మాణం పూర్తయ్యాయి. కానీ డిస్ట్రిబ్యూటరీల పనులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఆయకట్టుకు నీళ్లిచ్చే పనులు పూర్తికాకపోవడంతో చెరువులు నింపడం ప్రారంభించారు. గత డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నా ఇంకా కాలేదు.ఖరీఫ్‌ నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది.

7.25 టీఎంసీలతో లక్షా 93వేల ఎకరాల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన రెండోదశలో కూడా లిఫ్టు పైపులైన్‌ పనులు పూర్తయ్యాయి. కొంత నీటిని ఎత్తిపోసి చెరువులు నింపడం, కొంత ఆయకట్టుకు ఇవ్వడం చేస్తున్నా అన్ని పనులు పూర్తి కాలేదు. ఈ ఏడాది జులై నాటికి డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నా మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని డిస్ట్రిబ్యూటరీల కింద చెరువులు నింపడం ద్వారా కొంత ఆయకట్టుకు నీటిని ప్రతి సంవత్సరం సరఫరా చేస్తున్నారు.

లక్ష్యం మేరకు పనుల పూర్తికి చర్యలు

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జులై నాటికి పనులు పూర్తి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటున్నాం.దీనికి తగ్గట్లుగా పనులు పూర్తి చేయించడానికి గుత్తేదారులపై ఒత్తిడి తెస్తున్నాం.నిర్మాణంలో ఎదురైన అనేక సమస్యలు అధిగమించి వేగంగా పనులు చేయిస్తున్నాం.

- సుధాకర్‌రెడ్డి, ఎస్‌.ఇ

మరో 4 వేల కోట్లు అవసరం

2014 జూన్‌ నాటికి రూ.7291.96 కోట్లు ఈ ప్రాజెక్టుపై ఖర్చుచేశారు. గత ఆరేళ్లలో మరో రూ.5163 కోట్లు ఖర్చుచేశారు. మొత్తమ్మీద ఇప్పటివరకు రూ.12455 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.నాలుగువేల కోట్లు ఖర్చు చేస్తే కానీ ఈ ప్రాజెక్టు అన్ని రకాల పూర్తయ్యే అవకాశం లేదు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 32,262 ఎకరాలు అవసరం కాగా, ఇప్పటివరకు 28,740 ఎకరాలు సేకరించారు. మరో 3523 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ఇంత భూమిని సేకరించి పనులు పూర్తి చేయాలంటే ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది.

అంచనాలు పైపైకి

నులన్నింటికీ ఈపీసీ పద్ధతిలో ఒప్పందం చేసుకున్నా తీవ్ర జాప్యం జరగడంతో నిర్మాణ వ్యయం కూడా గణనీయంగా పెరిగింది.

ప్రాజెక్టు వ్యయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.