ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటిల్లో... ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దుంపలగూడెంకు చెందిన దీక్ష శ్రీ బంగారు పతకం సాధించింది. 16 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటిల్లో విజయం సాధించిన దీక్ష శ్రీని స్థానిక గ్రామ సర్పంచ్ సన్మానించారు.
దుంపలగూడెంకు చెందిన జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో దీక్షశ్రీ 6వ తరగతి చదువుతోంది. తండ్రి జగదీశ్వరరావు కరాటే మాస్టర్ కావటంతో చిన్నతనం నుంచే శిక్షణ ఇచ్చారు. దీంతో అంచెలంచెలుగా ఎదుగుతూ 2015 -16 లో మండల స్థాయి కరాటేలో పోటీల్లో విజయం సాధించింది. 2016 -17 జిల్లా స్థాయి టోర్నీలో గెలుపొందింది.
త్వరలో నేపాల్లో జరిగే అంతర్జాతీయ కరాటే పోటీల్లో దీక్షశ్రీ పాల్గొనబోతుందని తండ్రి జగదీశ్వరరావు తెలిపారు. తమ బిడ్డ ఎదగడానికి కొంత ఆర్థిక సహాయం చేయాలని కోరారు. ఆండగా ఉంటామని సర్పంచ్ వాణిశ్రీ రాజు హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: మంచి ప్రభుత్వానికి ఆ పట్టింపులు ఉండవు: మోదీ