ETV Bharat / state

Corona Cases in Schools: పాఠశాలలపై కరోనా పంజా.. రెండు చోట్ల ఐదుగురికి పాజిటివ్ - తెలంగాణ వార్తలు

Corona Cases in Schools, covid positive to teachers
పాఠశాలలపై కరోనా పంజా, ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్
author img

By

Published : Sep 3, 2021, 11:45 AM IST

Updated : Sep 3, 2021, 3:46 PM IST

11:40 September 03

పాఠశాలల్లో కరోనా పంజా.. వేర్వేరు చోట్ల ఐదుగురికి పాజిటివ్

పాఠశాలలు ప్రారంభమైన మూడు రోజుల్లోనే కరోనా(corona) కేసులు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు(covid cases) బయటపడ్డాయి. ములుగు జిల్లా(mulugu district) ఏటూరునాగారం మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా సోకింది. లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. గురువారం విధులకు హాజరైన ఈ ముగ్గురు ఉపాధ్యాయులు... విద్యార్థులకు పాఠాలు బోధించారు. మిగతా ఉపాధ్యాయులు పరీక్ష చేయించుకోగా... వారికి నెగిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.  

నిజామాబాద్‌ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌ పాఠశాలలోనూ ఓ విద్యార్థిని, అటెండర్‌కు కరోనా సోకింది. విద్యార్థిని తండ్రికి కూడా పాజిటివ్ అని తేలింది.  వెంటనే అప్రమత్తమైన అధికారులు... పాఠశాలలోని 75మందికి కొవిడ్‌ పరీక్షలు చేయించారు. ఈ నేపథ్యంలో ఎంఈవో ఆంద్రయ్య, వైద్యాధికారులు పాఠశాలను సందర్శించారు. కొవిడ్ భయంతో పాఠశాలకు ఐదుగురు విద్యార్థులే హాజరయ్యారు. భయం భయంగా తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపుతున్న వేళ... కరోనా కేసులు బయటపడుతుండటం కలకలం సృష్టిస్తోంది.

ఇదీ చదవండి: VIRAL VIDEO: 'నా చావుకు వాళ్లే కారణం.. దయచేసి అప్పులు చేయకండి'

Last Updated : Sep 3, 2021, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.