ETV Bharat / state

నిజాయితీ చాటుకున్న కండక్టర్​ - conductor

పోయిందనుకున్న సొమ్ము దొరికింది. బస్సులో మరిచిపోయిన పర్సును కండక్టర్​ బాధితురాలికి అప్పగించి నిజాయితీ చాటుకున్న ఘటన ములుగులో జరిగింది.

డబ్బులు అందిస్తున్న కండక్టర్​
author img

By

Published : May 30, 2019, 9:35 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నాగేంద్ర చారి.. బంధువుల ఇంటికి కుటుంబ సమేతంగా వెళ్లడానికి సిద్ధమై హన్మకొండ బస్టాండ్​లో తుపాకుల గూడెం బస్సు ఎక్కి ములుగు బస్టాండ్లో దిగారు. నాగేంద్ర చారి భార్య బస్సులో పర్సు మరిచిపోయింది. వెంటనే ములుగు బస్టాండ్​లో ఉన్న కంట్రోలర్ యాకయ్యను సంప్రదించగా తుపాకులగూడెం బస్సు డ్రైవర్, కండక్టర్​కు ఫోన్ చేసి విషయాన్ని తెలిపారు. ఆమె కూర్చున్న సీట్లో పర్సు మరిచిపోయిందని చెప్పడంతో... కండక్టర్ బస్సు పరిశీలించి పర్సును స్వాధీనం చేసుకున్నాడు. తుపాకుల గూడెం గ్రామానికి తిరుగు ప్రయాణమైన బస్సు కండక్టర్ ములుగు బస్టాండ్​లో ఉన్న కాంట్రోల్ యాకయ్య చేతుల మీదుగా కండక్టర్ రాజయ్య బాధితురాలికి పర్సు అందించారు. పర్సులో 5 తులాల వెండి, చరవాణి, రూ. 500 నగదు ఉన్నాయని తెలిపింది.

నిజాయితీ చాటుకున్న కండక్టర్​
ఇవీ చూడండి: కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.