ETV Bharat / state

'తరగతి గదిలోనే సమాజాభివృద్ధికి అంకురార్పణ చేసేది వారే' - mulugu teachers felicitation

ములుగు జిల్లా కేంద్రంలో 35 మంది ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్​ సి.నారాయణరెడ్డి ఘనంగా సన్మానించారు. తరగతి గదిలోనే సమాజ అభ్యున్నతికి శ్రీకారం చుట్టేది అధ్యాపకులేనని పాలనాధికారి కొనియాడారు.

'తరగతి గదిలోనే సమాజాభివృద్ధికి అంకురార్పణ చేసేది వారే'
author img

By

Published : Sep 9, 2019, 11:27 PM IST

'తరగతి గదిలోనే సమాజాభివృద్ధికి అంకురార్పణ చేసేది వారే'

ములుగు జిల్లా కేంద్రంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్​ సి.నారాయణరెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ ఛైర్మన్​ కన్నబోయిన రాజయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశ అభివృద్ధికి తోడ్పాటునందించే భావి పౌరులను తీర్చిదిద్దే శక్తి గురువులకే ఉందని కలెక్టర్​ తెలిపారు. తరగతి గదిలో సమాజాభివృద్ధికి అంకురార్పణ చేసేది ఉపాధ్యాయులేనని కొనియాడారు. జిల్లాలోని 35 మంది ఉపాధ్యాయులను సత్కరించి, ప్రశంసా పత్రాలు అందించారు.

ఇవీ చూడండి: శ్రమదానంలో పాల్గొన్న జిల్లా పాలనాధికారి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.