ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకోనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బాంబు, డాగ్ స్కోడ్లు హెలిప్యాడ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశాయి.
ఈ క్రమంలో ఓచోటు అనుమానాస్పదంగా కనిపించగా.. అక్కడ గడ్డపారతో తవ్వగా ఓ చిన్న ప్లాస్టిక్ వైర్ ముక్క లభించింది. తీగ ముక్కే అని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు. హెలిప్యాడ్ చుట్టూ దుమ్ము లేవకుండా పేడ నీళ్లతో చల్లారు. రేపు ఉదయం 11గంటలకు ముఖ్యమంత్రి హెలికాఫ్టర్లో మేడారం చేరుకొని అమ్మలను దర్శించుకుంటారు.
ఇవీ చూడండి: 'ప్రజలకు మరింత చేరువ కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం'