ETV Bharat / state

అమ్మల దగ్గరికొస్తే... అమ్మా అని పిలిచేవాడు మాయం - medaram

అప్పటివరకు తన కళ్లముందే ఆడుకున్న పసివాడు అకస్మాత్తుగా కనిపించకుండా పోయిన ఘటన మేడారం జాతరలో చోటుచేసుకుంది. కంగారు పడిన ఆ తల్లి చుట్టుపక్కల ఎక్కడ వెతికినా కన్న కొడుకు జాడ దొరకలేదు. నాలుగు రోజులైనా  కుమారుడి ఆచూకీ లేకపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

child missed in medaram jathara
అమ్మల దర్శనం కోసం వస్తే... అమ్మా అని పిలిచేవాడు దూరమయ్యాడు..
author img

By

Published : Feb 9, 2020, 7:11 PM IST

అమ్మల దర్శనం కోసం వస్తే... అమ్మా అనే పిలిచే కొడుకు దూరమయ్యాడని... తల్లి నువ్వే దిక్కంటూ వేడుకొంటోంది ఓ తల్లి. నాలుగు రోజులుగా కొడుకు జాడ కోసం మేడారం జాతర మొత్తం తిరుగుతూ వెతుకుతోంది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కన్నాల గ్రామానికి చెందిన అనిల్ కుటుంబ సమేతంగా సమ్మక సారలమ్మ జాతరకు వెళ్లారు. 6వ తేదీన అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. తిరిగి తమ గుడారానికి వెళ్లి చూసే సరికి తమ కుమారుడు సాయి శశాంక్ కనిపించలేదు.

చుట్టుపక్కల వెతికినా... ఆచూకీ తెలియలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 4 రోజులుగా జాడ కోసం మేడారంలోనే తిరుగుతూ కొడుకును వెతుకుతున్నారు. తన కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియక గుండెలు అవిసేలా రోదిస్తూ... కనిపించిన పోలీసులను, నాయకులను, అధికారులను కొడుకు జాడ తెలుపమని ప్రాధేయపడుతోంది ఆ తల్లి.

జాతర సమయంలో 150 మంది తప్పిపోగా... 149 మంది దొరికారు. ఈ పసివాడు మాత్రమే కనిపించకుండా పోయాడని అధికారులు తెలిపారు.

అమ్మల దర్శనం కోసం వస్తే... అమ్మా అని పిలిచేవాడు దూరమయ్యాడు..

ఇవీ చూడండి: అమ్మ గురించి ఆలోచించండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.