వాగు పొంగకపోతే.. ఆ చిన్నారి బతికేదేమో! - పిడుగు
ములుగు జిల్లా ఏటురునాగారం మండలంలో పిడుగుపాటుతో ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలపాల్యయారు. పొంగి పొర్లుతున్న వాగుల ఉద్ధృతితో వారిని ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయామని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
పిడుగుపాటుతో చిన్నారి మృతి
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందరాజులు కాలనీలో పిడుగు పాటుతో ఓ చిన్నారి మృతి చెందింది. గుడిసెమీద పిడుగు పడటం వల్ల అందులో ఉన్న ముగ్గురు పిల్లల్లో 8నెలల పసిగుడ్డు అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు చిన్నారులను ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహించింది. ఆ ధాటికి తట్టుకోలేక వారిని ఆస్పత్రికి తరలించలేకపోయామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Intro:tg_wgl_51_31_pidugu_paatuku_chinnari_mruthi_av_ts10072
G Raju mulugu contributar
ఇదే ఫ్లాగ్ నేమ్ తో విజువల్స్, ఫొటోస్ పంపించాను వాడుకోగలరు.
యాంకర్ వాయిస్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామ పంచాయతీ పరిధిలోని గోవిందరాజులు కాలనీలో భారీగా గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కురుస్తున్న వర్షానికి గుత్తి కోయ ముగ్గురు పిల్లలు ఉన్న గుడిసెలో పిడుగు పడటంతో స్రవంతి 8 నెలల చిన్నారి మృతి చెందింది. పిడుగుపాటుకు ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. పిడుగుపాటుకు గురైన చిన్నారులను ఏటూరునాగారం సామాజిక క ఆసుపత్రికి తరలిస్తుండగా కురిసిన భారీ వర్షానికి కొండాయి గ్రామ మార్గమధ్యంలో ఉన్న వాగు ఉదృతంగా ప్రవహించడంతో అస్వస్థతకు గురైన చిన్నారులను ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రికి తరలించి లేని పరిస్థితి నెలకొందని సమాచారం.
Body:sss
Conclusion:no