ETV Bharat / state

విద్యుత్‌ షాక్‌తో 17 గేదెలు మృతి - buffalo 17 died from electric shock at kasindipet mulugu district

కాసిందిపేట గ్రామంలో 11కేవీ విద్యుత్‌ తీగ తగిలి 17 గేదెలు మృత్యువాతపడగా మూడు తీవ్రంగా గాయపడ్డాయి. సుమారు రూ. 15 లక్షల విలువ చేసే మూగ జీవుల మృతితో పశువుల కాపరి సోకసంద్రంలో మునిగిపోయాడు.

buffalo 17 died from electric shock at kasindipet mulugu district
విద్యుత్‌ షాక్‌తో 17 గేదెలు మృతి
author img

By

Published : Apr 26, 2020, 9:23 PM IST

ములుగు మండలంలోని కాసిందిపేట గ్రామంలో విద్యాదాఘాతానికి గురై 17 గేదెలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన పశువుల కాపారి 17 బర్రెలు వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లాడు. పొలంలో పడి ఉన్న 11కేవీ కరెంట్‌ లైన్‌కు తాకి మృత్యువాతపడ్డాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డ మూడు బర్రెలకు వెటర్నరీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పదిహేడు మూగ జీవుల మృతితో పశువుల కాపారి ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

సుమారు రూ.15 లక్షల నష్టం వాటినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. నష్ట పరిహారం ఇప్పిస్తామని విద్యుత్ అధికారులు పశువుల కాపరికి హామీ ఇచ్చారు.

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందన గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా శిథిలావస్థకు చేరుకున్న కరెంట్ స్తంభాలను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: ఎక్కువ కేసులు నమోదైనా ఆందోళన వద్దు: రాజీవ్ గౌబా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.