ములుగు జిల్లాలోని 9 మండలాల్లో మంగళవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వాజేడు మండలం చీకుపల్లి సమీపంలో ఉన్న బొగత జలపాతం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఛత్తీసగఢ్ అడవుల నుంచి ఉప్పెనలా.. వస్తోన్న వరద నీటితో రాతి కట్టపై నుంచి బొగత ప్రమాదకరంగా పారుతోంది. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రదేశం కావడం వల్ల అటవీశాఖ అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల ప్రవాహం వద్ద అధికారులు హెచ్చరికగా ఎర్ర రిబ్బన్ను కట్టారు. తాత్కాలికంగా సందర్శనను నిలిపివేశారు.
ఇదీ చూడండి: 'జమ్మూ'పై మోదీకి అభినందనే 'సుష్మా' చివరి ట్వీట్