బోడ వినోద్ కుమార్ అనే యువకుడు మహబూబ్ నగర్ జిల్లా కురవి మండలం తాఠ్య తండా అనే గ్రామం నుంచి మేడారం వరకు దాదాపు 160 కిలోమీటర్లు సైకిల్‌పై యాత్ర చేపట్టాడు.
తన సొంత డబ్బులతో కరపత్రాలను ప్రచురించి వాటిని మార్గమధ్యంలో కలిసిన ప్రతి ఒక్కరికి పంచుతూ ప్లాస్టిక్ రహితంగా జాతర జరుపుకోవాలని ప్రజలలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. సైకిల్‌పై మేడారం వరకు చేరుకున్న వినోద్ అక్కడ చిరు వ్యాపారులకు కరపత్రాలను అందిస్తూ ప్లాస్టిక్ సంచులను వాడొద్దని విజ్ఞప్తి చేశాడు.
ఉడతా భక్తిగా ఈ మహా జాతరలో తన వంతు సాయం చేస్తున్నానని.. ప్రజల్లో, భక్తుల్లో ఏ కొంత మందికి దీనిని పాటించినా తన ఈ ప్రయత్నం సఫలం అవుతుందని తెలిపాడు.