అది 2001 ఫిబ్రవరి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వరంగల్ జిల్లా ఏటూరునాగారంలోని( ప్రస్తుతం ములుగు జిల్లా) ఐటీడీఏ పాలక మండలి సమావేశం పూర్తైంది. ఆ కార్యక్రమానికి హాజరైన నాటి వరంగల్ కలెక్టర్ ఆదిత్యనాథ్ దాస్.. తన వాహనంలో తిరుగు ప్రయాణమయ్యారు. దారిలో మావోయిస్టులు ఆయన కారుపై రెండు వైపుల నుంచి కాల్పులు జరిపారు. భుజం నుంచి బుల్లెట్ దూసుకెళ్లి.. ఆదిత్యనాథ్ గాయపడ్డారు. ఆయన వాహనం నడిపుతున్న డ్రైవర్ సాంబయ్య కాలికీ బుల్లెట్లు తగిలి తీవ్ర రక్తస్రావమైంది.
ఆ పరిస్థితుల్లోనూ డ్రైవర్ సాంబయ్య తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు. కలెక్టర్ ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా పనిచేశారు. గాయాన్ని లెక్కచేయకుండా కారును వేగంగా ముందుకు నడిపి.. ఆయన ప్రాణాలను కాపాడారు. మర్నాడు సాంబయ్య సాహసాన్ని అందరూ శ్లాఘించారు. ప్రస్తుతం... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆయన అప్పటి దుర్ఘటన జ్ఞాపకాలను ‘ఈనాడు’తో పంచుకున్నారు. ఆదిత్యనాథ్ దాస్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
![ap cs adityanath das](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9986444_320_9986444_1608784418521.png)
ఇవీచూడండి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్