మేడారం చినజాతర ముగింపునకు వచ్చింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు... గద్దెల వద్దకు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో తల్లులను దర్శించుకుంటున్నారు. సమ్మక్క- సారలమ్మలకు ఎత్తు బెల్లం, చీర సారె సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
అందుబాటులోకి షెడ్లు...
ఐటీడీయే, దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలను భక్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. చిలుకల గుట్ట వద్ద రెండు, జంపన్నవాగుకు వెళ్లే దారిలో రెండు, రెడ్డిగూడెం వద్ద ఐదు షెడ్లను నిర్మించారు. గత జాతరలోనే వీటిని నిర్మించినా... అవి పూర్తిస్ధాయిలో ఈ జాతరకు అందుబాటులోకి వచ్చాయి. వెయ్యిమందికి పైగా భక్తులకు సరిపడే విధంగా వీటిని నిర్మించారు. ఫ్యాన్లు, మొబైల్ ఛార్జింగ్ సౌకర్యం కల్పించారు. మిషన్ భగీరథ నీరు పుష్కలంగా అందుబాటులో ఉంటోంది. ఇక్కడే వంటలు చేసుకంటూ నిద్రలు చేస్తూ వనదేవతలను భక్తులు దర్శించుకుంటున్నారు.
నేటితో ముగింపు...
పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ... నిర్మించిన షెడ్లు బాగున్నాయని భక్తులు చెబుతున్నారు. నాలుగు రోజుల పాటు ఘనంగా జరిగిన చిన జాతర ఇవాళ్టితో ముగుస్తుంది. రేపు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వనదేవతల సందర్శనార్థం మేడారం విచ్చేస్తారు.
ఇదీ చూడండి: జనసందోహంగా మేడారం చిన జాతర