ETV Bharat / state

అమాయకపు చూపులతో కుటుంబ పోషణ కోసం - ములుగు జిల్లా

తెలిసి తెలియని వయస్సు. అమాయకపు చూపులు. అయినా కుటుంబ పోషణ కోసం గాంధీ వేషధారణలో ఎండలో నిల్చున్నాడు. ఇది చూసి స్థానికులు సెల్ఫీలు దిగుతున్నారు. తోచిన డబ్బు చేతికందిస్తున్నారు. ఆ చిన్నోడు మాత్రం తనకేమి పట్టనట్టు బొమ్మ ఫోన్​తో ఆడుకుంటున్నాడు. ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్న మేడారం జాతరలో ఆ పిల్లాడి చేష్టలు ఒకవైపు ముద్దుగా తోస్తున్నా.. మరోవైపు అయ్యో పాపం అనిపిస్తుంది.

అమాయకపు చూపులతో కుటుంబ పోషణ కోసం
అమాయకపు చూపులతో కుటుంబ పోషణ కోసం
author img

By

Published : Feb 7, 2020, 7:43 PM IST

అమాయకపు చూపులతో కుటుంబ పోషణ కోసం

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఏదో ఒక పని చేసుకొనైనా పొట్ట నింపుకోవాలనుకునేవారు అనేకమంది కనిపిస్తారు. వన దేవతలున్న ఈ జాతరలో ఓ చిన్న పిల్లాడికి గాంధీ వేషధారణ వేసి దారిలో నిల్చొబెట్టింది తన తల్లి. అటువైపు వచ్చే వారు దయతలచి ఎంతోకొంత నగదు దానం చేస్తారనే ఉద్దేశ్యంతో ఆమె అలా చేసింది.

చిన్నోడితో సెల్ఫీలు:

తెలిసి తెలియని వయస్సుతో అమాయకంగా చూస్తున్న ఆ చిన్నోడితో భక్తులు సెల్ఫీలు తీసుకుంటున్నారు. వారికి తోచినది ఆ బాబు చేతిలో పెట్టి వెళ్లిపోతున్నారు. అయితే ఇవేవి తనకు పట్టనట్టు దగ్గరున్న బొమ్మ ఫోన్​తో ఆడుకోవడంలో ఆ పిల్లాడు నిమగ్నమయ్యాడు. తన కుమారుడితో అలా చేయించడం తప్పని తెలిసినా.. కుటుంబ పోషణ కోసం తప్పడం లేదని అతని తల్లి చెప్తోంది.

ఇవీ చూడండి: సమ్మక్క, సారలమ్మ సన్నిధిలో కేసీఆర్... పట్టు వస్త్రాల సమర్పణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.