మేడ్చల్‌లో ఓ యువకుడు కరోనా వ్యాధి లక్షణాలపై కొత్త తరహా ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన అవినాష్ తన ముఖానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ... వెనుక కరోనా రక్కసి మాస్క్ ధరించి ప్రచారం చేశాడు.
వీధివీధి తిరుగుతూ సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నాడు. ఏ వస్తువులు తాకకండి... మీకు చేతులు జోడించి దండం పెడుతున్నా అంటూ ప్రజలను వేడుకున్నాడు. మాస్క్‌లు ధరించకపోతే సరకులు అమ్మవద్దంటూ దుకాణ యజమానులకు విజ్ఞప్తి చేశాడు. వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని పౌరులను కోరాడు.
ఇవీచూడండి: అలాంటి వారికి కరోనా రావాలి: సీఎం కేసీఆర్