జీహెచ్ఎంసీలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. మరమ్మతుల కారణంగా నీటి సరఫరాలో ఇబ్బంది ఏర్పడిందని తెలిపింది. పైపుల లీకేజీ పనులు, ఇతర నిర్మాణాల పనుల వల్ల గురువారం ఉదయం 6 గంటల నుండి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు జలమండలి ప్రకటించింది.
నీటి సరఫరా అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
ఓ అండ్ ఎం డివిజన్ నం 15 - గంగారాం, దీప్తీ శ్రీ నగర్, కెఎస్ఆర్ ఎన్ క్లేవ్, అపర్ణ హిల్స్, ఆదర్శ్ నగర్, శాంతి నగర్, మియాపూర్, మైత్రినగర్, మదీనాగూడ, ఉషోదయ నగర్, వైశాలి నగర్, రామకృష్ణ నగర్, సాయిరాం కాలనీ, మియాపూర్ క్రాస్ రోడ్స్, మాతృ శ్రీ నగర్, రాజారాం కాలనీ, అంబేడ్కర్ నగర్, జనప్రియ ఫేజ్ 1 అండ్ 2, మియాపూర్ విలేజ్, మాధవ్ నగర్, భాను టౌన్ షిప్, నంది కోఆపరేటివ్ సొసైటీ, హుడా మయూరి నగర్, ఎస్సీ బోస్ నగర్, సిర్లా గార్డెన్స్, ఆర్బిఆర్ బాలాజీ నగర్, ఆదిత్య నగర్, శ్రీరంగాపురంలో రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది.
ఓ అండ్ ఎం డివిజన్ నం 9 - హైదర్ నగర్, అడ్డగుట్ట, నిజాంపేట్ మెయిన్ రోడ్, కెపీహెచ్‌బీ కాలనీలోని వసంత్ నగర్, రామ్ నరేష్ నగర్, ఓ అండ్ ఎం డివిజన్ నం 32 - బొల్లారం మున్సిపాలిటీ, ఐలాపుర్ గ్రామం, గండి గూడెం, సుల్తాన్‌పూర్, కిష్టారెడ్డి పేట్, పటేల్ గూడ, ఓ అండ్ ఎం డివిజన్ నం-6 పరిధిలో ఎస్అర్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.