ప్రభుత్వ భూములకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డాడని మేడ్చల్ జిల్లా గాజులరామారం వీఆర్ఏను కుత్బుల్లాపూర్ తహసీల్దార్ సస్పెండ్ చేశారు. మేడ్చల్ జిల్లా గాజులరామరంలో రక్షించించాల్సిన ప్రభుత్వ భూములను కబ్జాదారులతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడుతున్నాడని తహసీల్దార్‌కు పలు ఫిర్యాదులు అందాయి.
ఈ మేరకు వీఆర్ఏ బాలయ్యను తహసీల్దార్ గౌరివత్సల సస్పెండ్ చేశారు. బాలయ్యకు (వీఆర్ఏ) అనారోగ్యం కారణంగా కొన్నాళ్లుగా కుమారుడు ఉప్పరి వాసు వీఆర్ఏగా చలామణి అవుతున్నాడు. తహసీల్దార్‌కు ఫిర్యాదులు రాగా.. తండ్రిని సస్పెండ్ చేసి కుమారుడిపై దర్యాప్తు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ వెల్లడించారు.