మేడ్చల్ జిల్లా దుండిగల్ మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి అధికారులు రూపొందించిన ముసాయిదా ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారింది. వార్డుల వారీగా కులగణనను చేసిన అధికారులు తప్పులను గుర్తించకలేకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
పలు వార్డులలో ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండటం, మృతిచెందిన వారికి ఓట్లు ఇవ్వడంపై రాజకీయ నాయకుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రెండు ఇంటి నంబరులపై భారీ మొత్తంలో ఓట్లు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డికి ఫిర్యాదు చేశారు.
మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు, కులగణన చేసినప్పటికీ తప్పులు దొర్లడం పట్ల నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: వెలుతురులేమితో వాహనాలు పరస్పరం ఢీ