మేడ్చల్ జిల్లా నాగారంలో మట్టి వినాయక విగ్రహాల వాడకంపై ఓ పాఠశాల విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన కృతిమ వినాయకులను పూజించడం వల్ల పర్యావరణానికి హాని జరుగుతుందని పాఠశాల ఉపాధ్యాయురాలు అన్నారు. విద్యార్థులు ఇంటింటికీ వెళ్లి మట్టి విగ్రహాలను మాత్రమే పూజించమని పీఓపీతో చేసిన వినాయకుని ప్రతిమలు ప్రతిష్ఠించొద్దని తెలిపారు. ప్రకృతిని కలుషితం చేయవద్దని తెలుపుతూ అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఇదీ చూడండి :ఆర్టీసీ ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సభ రసాభాస