ETV Bharat / state

నా అన్న వాళ్లంతా పోయారు.. అనాథలయ్యారు...

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అమ్మానాన్నలు అనారోగ్యంతో ఏడాది క్రితం మృత్యువాత పడ్డారు.. దీంతో వారి ఇద్దరి అమ్మాయిల్ని.. అన్నీతానై వృద్ధురాలైన నానమ్మ అప్పటి నుంచి సాకుతూ వస్తోంది. నాలుగైదు రోజుల క్రితం నానమ్మను అనారోగ్యం రూపంలో మృత్యువు కబళించింది. దీంతో వారు మళ్లీ దిక్కులేనివారయ్యారు.

TWO GIRLS BECAME ORPHANS IN SHAMEERPET
నా అన్న వాళ్లంతా పోయారు.. అనాథలయ్యారు...
author img

By

Published : May 4, 2020, 9:41 AM IST

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామానికి చెందిన మహ్మద్‌ సుల్తాన్‌- శైనాజ్‌ దంపతులకు సానా(14), సాధియా(12) ఇద్దరు పిల్లలు. ఏడాది క్రితం తండ్రి గుండెపోటుతో మృత్యువాత పడగా.. ఆ తర్వాత కొద్ది రోజులకే తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. తల్లిదండ్రులు దూరమైన ఆ బాలికలను నాన్నమ్మ చేరదీసింది. తనకు వచ్చే వృద్ధాప్య పింఛనుతోనే వారిని పోషించింది.

కేశవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సానా.. 8వ తరగతి, సాధియా.. 7వ తరగతి చదువుతున్నారు. నాన్నమ్మ ఇటీవల మృతిచెందడంతో ఆ బాలికలు అనాథలయ్యారు. వారికి ఇల్లు లేకపోవడంతో ఒక పూరిపాకలోనే కాలం వెళ్లదీస్తున్నారు. వీరి పరిస్థితిని చూసి చలించిన ఆ గ్రామ సర్పంచి ఉడుతల జ్యోతిగౌడ్‌, స్థానిక నాయకులు.. కొంత ఆర్థికసాయం, నిత్యావసర సరుకులు అందించారు.

ఇవీ చూడండి: వైద్యులకు వందనం.. 'గాంధీ'పై పూలవర్షం

For All Latest Updates

TAGGED:

SAD NEWS
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.