ETV Bharat / state

'హైదరాబాద్​ అభివృద్ధి ప్రయాణంలో తెరాసతో కలిసి రావాలి' - గ్రేటర్​ ఎన్నికలు

కుత్బుల్లాపూర్​ డివిజన్​ తెరాస అభ్యర్థి కూన పారిజాత తరఫున ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. తెరాస గతంలో ప్రకటించిన ప్రణాళికను వందశాతం అమలు చేసిందని ఎంపీ నామ నాగేశ్వరరావు తెలిపారు. భాగ్యనగరం అభివృద్ధి ప్రయాణంలో తెరాసతో కలిసి ప్రజలు ముందుకు రావాలని ఆయన సూచించారు.

trs mp nama nageshwara participated ghmc election compaign at kutbullapur division in medchal district
'హైదరాబాద్​ అభివృద్ధి ప్రయాణంలో తెరాసతో కలిసి రావాలి'
author img

By

Published : Nov 24, 2020, 3:56 PM IST

Updated : Nov 24, 2020, 6:07 PM IST

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్ డివిజన్ తెరాస కార్పొరేటర్ అభ్యర్థి కూన పారిజాత తరపున ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రచారం నిర్వహించారు. డివిజన్ పరిధిలోని గణేష్ నగర్​లో జరిగిన సమావేశంలో వారు పాల్గొన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధి ప్రయాణంలో తెరాసతో కలిసి ప్రజలు ముందుకు రావాలని ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. నగర ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. ఎక్కడా రాజీ లేకుండా ముందుకు సాగుతోందన్నారు. తెరాస గతంలో ప్రకటించిన ప్రణాళికను వందకు వంద శాతం అమలు చేసిందని.. చెప్పని అంశాలను కూడా ప్రజల సౌకర్యార్థం అందుబాటులో ఉంచి అమలు చేసిన ఘనత తెరాసకే దక్కుతుందన్నారు

ఎన్నికలు వస్తున్నందుకు ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో భాగంగా భాజపా నాయకులు అంతా మేమే చేశామని చెప్పుకొస్తున్నారని నామ మండిపడ్డారు. హైదరాబాద్​లో వారు ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తెరాసను ఎన్నుకుంటేనే భాగ్యనగరం మరింత అభివృద్ధి అవుతుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద పాల్గొన్నారు.

'హైదరాబాద్​ అభివృద్ధి ప్రయాణంలో తెరాసతో కలిసి రావాలి'

ఇవీ చూడండి: బల్దియా పోరులో సై అంటున్న విద్యావంతులు

Last Updated : Nov 24, 2020, 6:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.