ప్రభుత్వ భూములు, చెరువులను రక్షించాలని దీక్ష చేస్తుంటే తమ నాయకులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని భాజపా నేత కొలను హనుమంతు రెడ్డి అన్నారు. భూ ఆక్రమణలను నిరసిస్తూ.. నిజాంపేట్‌లోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.
ప్రభుత్వ భూములను రక్షించాలని దీక్ష చేస్తుంటే తమ నాయకులను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అనంతరం శిబిరంలో ఉన్న భాజపా నాయకులను అరెస్టు చేశారు.