మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలో మూడు కరోనా కేసులు నమోదవ్వగా ఆ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. 14 రోజుల పాటు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం వల్ల కంటైన్మెంట్ జోన్లుగా ఉన్న అపురూప కాలనీ, మోడీ బిల్డర్స్, సుభాశ్నగర్లపై ఉన్న ఆంక్షలు ఈరోజు ఎత్తివేశారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశానుసారం కంటైన్మెంట్ జోన్లను ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు. ఆంక్షలు ఎత్తివేసినా... ఆ జోన్లలోని ప్రజలు బయటకు రాకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిత్యావసరాలు, మరే ఇతర సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు.