ETV Bharat / state

దొంగగా మార్చిన అప్పులు, కుటుంబ పోషణ - అప్పులు

చేస్తున్న వ్యాపారంలో సరైన రాబడీ రాకపోవడం.. చేసిన అప్పులు తిరిగి ఇవ్వడమే కాక కుటంబపోషణ కష్టంగా మారడం వల్ల దొంగ అవతారం ఎత్తాడు. మొదటి ప్రయత్నంలోనే పోలీసులకు చిక్కి జైలు పాలయ్యిన సంఘటన మేడ్చల్​ జిల్లా ఘట్​కేసర్​ పీఎస్​ పరిధిలో చోటుచేసుకుంది.

దొంగగా మారిన అబ్దుల్​ అజీజ్​
author img

By

Published : Oct 16, 2019, 5:55 AM IST

దొంగగా మార్చిన అప్పులు, కుటుంబ పోషణ
మేడ్చల్‌ జిల్లా ఘట్ కేసర్‌ పోలీస్​ స్టేషన్‌ పరిధిలోని ఈడబ్ల్యూఎస్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ అబ్దుల్‌ అజీజ్‌ ఆలియాస్‌ జాఫర్‌ ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. స్థానికంగా గత పదేళ్లుగా స్టీల్‌ వ్యాపారం చేస్తున్నాడు. 2018లో వివాహం జరిగింది. ఇద్దరు ఆడ పిల్లలు(కవలు) పుట్టారు. వ్యాపారంలో రాబడీ తగ్గిపోవడం వల్ల తెలిసిన వారి దగ్గర అప్పులు చేశాడు. వాటిని తిరిగి ఇవ్వడం కష్టంగా ఉండేది. దీనికి తోడు కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. ఇక చేసేదేమీ లేక గొలుసు దొంగగా అవతారం ఎత్తాడు.

ఈనెల 10న యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్‌కు చెందిన సత్యలక్ష్మి.. తన కుమారుడు సంతోష్​ కుమార్‌తో కలిసి హైదరాబాద్‌ చంపాపేట నుంచి ద్విచక్రవాహనంపై మాదాపూర్‌కు వెళ్తోంది. వరంగల్‌ జాతీయ రహదారి అన్నోజిగూడ వంతెన వద్దకు రాగానే వెనక నుంచి మరో ద్విచక్రవాహనంపై వచ్చిన అజీజ్‌.. సత్యలక్ష్మి మెడలో ఉన్నబంగారు గొలుసు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి కుమారుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమానంతో అజీజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. అతని నుంచి బంగారు గొలుసుతో పాటు ద్విచక్రవాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: రామకృష్ణపూర్​లో యువకుడి దారుణహత్య

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.