మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధి లోని ప్రేమ్ విజయ నగర్ కాలనీలో చోరీ జరిగింది. పరిసరాలను గమనించిన దుండగులు..అదును చూసి..ఓ ఇంటి కిటికీ ఊచలు కట్ చేసి అందినంత దోచుకెళ్లారు.. సుమారు పది తులాల బంగారం, ఆరు జతల కమ్మలు, వెండి,ఐదువేల రూపాయలు దొంగతనం జరిగిందని బాధితులు తెలిపారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
ఇవీ చదవండి: విషాదం: ఊబిలో పడి తాతా, మనుమడు మృతి