ఇవీ చూడండి: సిగరెట్ ఇవ్వలేదని సోదరుడిని చంపేశాడు!
పనిచేస్తున్న షాపులోనే దొంగతనం - theft in working auto mobile shop
తిన్నింటికే వాసాలు లెక్కపెట్టారు ఆ ముగ్గురు. పనిచేస్తున్న షాపులోనే దొంగతనం చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల్లో చోరీ కేసును చేధించారు. మొత్తం నలుగురు నిందితులను అరెస్టు చేశారు.
పనిచేస్తున్న షాపులోనే దొంగతనం
మేడ్చల్ జిల్లా కీసర మండలం నాగారంలో గతనెల 31న అర్ధరాత్రి విజయ లక్ష్మి ఆటో మొబైల్ షాప్లో దొంగతనం జరిగింది. షాపు యజమాని కార్వేడి చంద్ర శేఖర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 24 గంటల్లో నిందితులను పట్టుకున్నారు. అదే దుకాణంలో పనిచేసే ముగ్గురిని, వారితో పాటు మరో యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి లక్షా 18000 నగదు స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.
ఇవీ చూడండి: సిగరెట్ ఇవ్వలేదని సోదరుడిని చంపేశాడు!
sample description