ETV Bharat / state

ఆమెకు పురిటినొప్పులొస్తే పోలీసు వాహనమే అంబులెన్స్ అయ్యింది! - police vahicle

ఆపద సమయంలో అండగా ఉండేవారే పోలీసులను మరోసారి నిరూపించారు. ఓ మహిళకు పురిటినొప్పులు రాగా... మానవత్వం చాటుకున్నారు.

The pregnant woman was taken to the hospital
ఆమెకు పురిటినొప్పులొస్తే పోలీసు వాహనమే అంబులెన్స్ అయ్యింది!
author img

By

Published : Apr 2, 2020, 11:31 AM IST

Updated : Apr 2, 2020, 11:52 AM IST

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్‌ డివిజన్‌లోని నాగలక్ష్మినగర్‌కు చెందిన మునికుమారికి పురటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. అందుబాటులో వైద్యసేవలు లేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించారు.

రాచకొండ పోలీసు కమిషనరేట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన వాలంటీర్లు సాయిశ్రావణ్‌, సూరజ్‌ పెట్రోలింగ్‌ పోలీసులను అప్రమత్తం చేశారు. ఎస్సై నరేందర్‌రెడ్డి, కానిస్టేబుల్‌ దశరథ్‌.. మునికుమారిని పోలీస్‌ వాహనంలో మల్లాపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.

నిండు గర్భిణిని సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో ఆమె సాధారణ ప్రసవం ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, మాతా శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారిణి శిరీష తెలిపారు.

Last Updated : Apr 2, 2020, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.