మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఉప్పల్‌లో పౌర సరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల నిరుపేద ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీ జరగక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏప్రిల్ నెల ప్రారంభమై 3 రోజులు అవుతున్నా.. బియ్యం సరఫరా చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బియ్యం ఎప్పుడు పంపిణీ చేస్తారని రేషన్ డీలర్‌ని అడిగితే.. నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి.. బియ్యం పంపిణీ జరిగేలా చూడాలని కోరుతున్నారు.