మేడ్చల్ జిల్లా చర్లపల్లి పారిశ్రామిక వాడలో ప్రనవ్ ఫుడ్ ప్రాసెస్సర్ ఇండియా అనే కంపెనీలో బాలకార్మికులతో పనిచేయిస్తున్నారంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. దాదాపు నాలుగు రోజులుగా బయట ప్రపంచానికి తెలియకుండా చిన్నారులతో బ్రెడ్ తయారుచేస్తున్నారని వారు ఆరోపించారు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోన్న పరిశ్రమను వెంటనే సీజ్ చెయ్యాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు.
తమ రాక చూసి తయారీ పరిశ్రమ నుంచి చిన్నారులు పారిపోయారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని లేబర్ నాయకుల దృష్టికి తీసుకువెళ్తామని.. దీనిపై కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించకపోతే, వారి ఇంటిని ముట్టడిస్తామని విద్యార్థి నాయకులు హెచ్చరించారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో తగ్గని కరోనా ఉద్ధృతి.. గంటకు 62 పాజిటివ్ కేసులు