ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించిందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూన శ్రీశైలం గౌడ్ ఆరోపించారు. రైతు రుణమాఫీ 60 నుంచి 70 శాతం మందికి ఇంతవరకు అందలేదని... యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆదుకుంటుందనుకున్న రైతుబంధు సకాలంలో అందక అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతు సమస్యలను వెంటనే ఉన్నతాధికారులకు నివేదించి... పరిష్కరించాలని కోరుతూ కుత్బుల్లాపూర్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చూడండి: 'గణపతి బప్పా మోరియా... రైతులకు లేదు యూరియా'