ETV Bharat / state

ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ.. తల్లిదండ్రుల దాడి.. పోలీసులకు ఫిర్యాదు.. - ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ

Students Fight Issue: స్కూల్లో ఓ చిన్న విషయమై ఇద్దరు విద్యార్థులు కొట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి కళ్లద్దాలు పగిలి కంటికి తీవ్రగాయమైంది. ఈ విషయం తెలిసి.. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు కోపంతో ఊగిపోతూ... కొట్టిన అబ్బాయిపైన దాడికి దిగారు. అనంతరం పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు కూడా ఇచ్చారు.

sri-chaitanya-students-fighting-gone-serious-and-parents-gave-police-complaint

author img

By

Published : Mar 29, 2022, 4:41 PM IST

Students Fight Issue: మేడ్చల్​లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఇప్పుడు పోలీస్​స్టేషన్​లో​ ఫిర్యాదులు చేసుకునేంత​ వరకు వెళ్లింది. శ్రీచైతన్య పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న ఇద్దరు విద్యార్థులు.. సోమవారం రోజు(మార్చి 28న) ఫేర్​వెల్​ పార్టీ కోసం రిహార్సల్స్​ చేస్తున్న క్రమంలో గొడవ పడ్డారు. గొడవ కాస్త పెద్దదై.. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఓ విద్యార్థికి కళ్లద్దాలు పగిలి గుచ్చుకోవటంతో కంటికి తీవ్ర గాయమైంది. పాఠశాల యాజమాన్యం వెంటనే స్పందించి.. బాధిత విద్యార్థికి వైద్యం చేపించారు.

ఈరోజు(మార్చి 29న) బాధిత విద్యార్థి తల్లిదండ్రులు.. పాఠశాలకు వచ్చి కొట్టిన అబ్బాయిపై దాడి చేశారు. అతడి తల్లిదండ్రుల ముందే ఇష్టమున్నట్టు కొట్టారు. పాఠశాల యాజమాన్యం ఎంత ఆపినా ఆగకుండా.. కోపోద్రేకంతో ఊగిపోతూ విద్యార్థిని కొట్టారు. తమ కుమారుని కన్నుపోతే ఎవరు బాధ్యులంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. 45 మంది సిబ్బంది ఉన్నా.. పిల్లలు గొడవపడుతుంటే పట్టించుకోకపోవటం దారుణమన్నారు.

అనంతరం ఇద్దరు విద్యార్థులు తల్లిదండ్రులు ఒకరిపై ఒకరు పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో కాంప్లైంటులైతే వచ్చాయి.. కానీ.. ఎవరిపై ఎలాంటి కేసులైతే నమోదు చేయలేదని సీఐ ప్రవీణ్​రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.