మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రహదారులు, దుకాణాలు, వీధుల్లో అగ్నిమాపక సిబ్బందితో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకే ముందు జాగ్రత్తగా రోడ్లపై పిచికారి చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి : 'ఆ నియోజకవర్గంలో ఇప్పటికి ఒక్క కేసు నమోదు కాలేదు'